Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఔదార్యం

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర మరోసారి తన ఔదార్యాన్ని చాటారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జోగు రామన్నలతో కలిసి చదువుల తల్లి సరస్వతి అమ్మ వారు కొలువైన బాసరలో మున్నూరుకాపు నిత్యాన్నదాన సత్రానికి రూ. 10 లక్షల చెక్కును అందించారు. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఈ సత్రాన్ని నెలకొల్పారు. మాజీ మంత్రి జోగు రామన్న నాయకత్వాన ముధోల్ నియోజకవర్గం మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు రోళ్ల రమేష్, డాక్టర్ కిరణ్ కొమ్రెవార్ ,పిప్పర కృష్ణ, సిద్ధంవార్ వివేకానంద, మంద లింగన్న,కోర్వ శ్యామ్,తోట రాము,చిమ్మన్ పోశెట్టి, వెన్నెల అనిల్ తదితరులు మంగళవారం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మాజీ మంత్రి జోగు రామన్నలతో కలిసి రూ.10 లక్షల చెక్కును నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ చైర్మన్ రోళ్ల రమేష్ కు సంఘం ప్రముఖుల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ రవిచంద్ర, కమలాకర్ లను శాలువాలతో సత్కరించారు.

మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ గా మీసాల చంద్రయ్య:
మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ గా మీసాల చంద్రయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశానికి మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జోగు రామన్న, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్థార్ పుటం పురుషోత్తమ రావు, కౌన్సిల్ సభ్యులు సీ.విఠల్, రౌతు కనకయ్య, బండి పద్మక్క తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆహ్వానం:
కాగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తదితర ప్రముఖులను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆహ్వానించింది. కమిటీ నాయకులు పూస నరేందర్, సూర్య విష్ణు, బాల్ కుమార్, వినోద్ యాదవ్, గౌరీశెట్టి వినోద్ తదితరులు ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే కమలాకర్ లను శాలువాలతో సత్కరించి వినాయక చవితి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.

Popular Articles