జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనారోగ్య బాధితులకు తన సిఫారసు మేరకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పంపిణీ చేశారు. బుర్హాన్ పురంలోని తన క్యాంప్ కార్యాలయంలో శనివారం రూ. 2.50 లక్షల చెక్కులను ఎంపీ రవిచంద్ర అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వివిధ కారణాల చేత అనారోగ్యం పాలైన బాధితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ కార్పోరేటర్ తోట వీరభద్రం, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లేడిబోయిన గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
