మహా శివరాత్రి సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మి దంపతులు ఖమ్మం కాల్వొడ్డులో గల గుంటు మల్లేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఎంపీ రవిచంద్ర-విజయలక్మి దంపతులు బుధవారం తెల్లవారుజామున గుంటు మల్లేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు, ఆలయ కమిటీ ప్రముఖులు ఎంపీ రవిచంద్రను శాలువాతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు. ఎంపీ వద్దిరాజు దంపతులతోపాటు యూత్ లీడర్స్ సుంకర చిరంజీవి, ఆకుల సాయి, మద్దెల భానుప్రతాప్ తదితరులు గుంటు మల్లేశ్వరస్వామిని దర్శించుకున్నారు.


