బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తెలంగాణా భవన్ కు తరలిరావలసిందిగా ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. పార్టీ యువనేత కేటీఆర్ కు మద్ధతు పలకాలని గులాబీ కేడర్ ను కోరారు. ఈమేరకు రవిచంద్ర ఓ ప్రకటకన విడుదల చేశారు. విచారణ పేరుతో తెలంగాణ ప్రభుత్వం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను వేధించడానికి చేసే కుట్రలను విచ్ఛిన్నం చేస్తూ ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ కు హాజరవుతున్న కేటీఆర్ కు మద్దతు పలుకుదామని వద్దిరాజు పిలుపునిచ్చారు. ఈనెల 16వ తేదీన సోమవారం ఉదయం 9:00 గంటలకు బీఆర్ఎస్ ముఖ్య నాయకులంతా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు చేరుకోవాలని కోరారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్ వరకు ప్రదర్శనగా వెళ్లి కేటీఆర్ కు మద్దతు పలుకుదామని ఎంపీ వద్దిరాజు పార్టీ నాయకులను కోరారు.
