Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

మరో మంత్రికి ‘ఘంటా’!? ఎంపీ రేవంత్ సంచలన ట్వీట్!!

ఓ ఆంగ్ల పత్రిక రాసిన వార్తా కథనం సంగతేమోగాని, ఆయా కథనపు క్లిప్పింగ్ ను ఉటంకిస్తూ మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. మంత్రి జగదీష్ రెడ్డిని ఉటంకిస్తూ ఆంగ్ల పత్రిక ఒకటి మంగళవారం ఓ ఆసక్తికర రాజకీయ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలోని నిజానిజాలు, రాజకీయ పరిణామాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఆయా వార్తా కథనపు క్లిప్పింగులను జత చేస్తూ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ భిన్న చర్చకు దారి తీసింది. ‘రస’కందాయంలో హంపి ‘ధూమ్ ధామ్’… కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం… యుముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా…?! అనే వ్యాఖ్యలతో రేవంత్ ట్వీట్ చేశారు. తెలంగాణా రాజకీయ వర్గాల్లో ఆంగ్ల పత్రిక కథనం, రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ లో ఉపయోగించిన పదాల గురించే రకరకాల చర్చలు జరుగుతుండడం విశేషం. రేవంత్ రెడ్డి ట్వీట్ ను దిగువన మీరూ చూసేయండి.

Popular Articles