Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

ఢిల్లీకి బయలుదేరిన ఎంపీ గాయత్రి రవి

రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గాయత్రి రవి (వద్దిరాజు రవిచంద్ర) కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు, టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావుతో కలసి ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి పయనమయ్యారు.

శంషాబాద్ విమానాశ్రయంలో నామ నాగేశ్వర్ రావు, గాయత్రి రవి

ఈనెల ౩౦న ఉదయం 11:00 గంటలకు పార్లమెంటులో రాజ్యసభ చైర్మన్ ముప్పవరపు వెంకయ్య నాయుడు గాయత్రి రవి చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఢిల్లీలో జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. వీరంతా ఆదివారం ఉదయానికే ఢిల్లీ చేరడం విశేషం.

Popular Articles