వరంగల్ నగరంలో వడ్డీ వ్యాపారి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. కాజీపేట రైల్వే క్వార్టర్స్ వద్ద నవీన్ కుమార్ అనే వడ్డీ వ్యాపారిని రైల్వే ఉద్యోగి ప్రవీణ్ కుమార్ కొట్టి చంపాడు. ఇవ్వాల్సిన డబ్బు ఇస్తానని పిలిచి మరీ ప్రవీణ్ కుమార్ ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ హత్యోదంత సమయంలో ప్రవీణ్ ప్రియురాలు కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
