బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై గులాబీ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈమేరకు ఆమెను పార్టీనుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ నిర్ణయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, సోమ భరత్ కుమార్ లు మంగళవారంఓ ప్రకటన ద్వారా సస్పెన్షన్ అంశాన్ని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, అవినీతి తదితర అంశాలపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత నిన్న మీడియాతోమాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మాజీమంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ లపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెపై సస్పెన్షన్ వేటు వేస్తూ పార్టీ ప్రకటించడం గమనార్హం. పార్టీ ఆదేశంతోనే ఈ చర్య తీసుకున్నట్లు వారు వెల్లడించారు.

