Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

నాన్నా.. మీ చుట్టూ ఏం జరుగుతోందో చూసుకోండి!

  • ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారను. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఏమన్నారో ఆమె మాటల్లోనే..
  • నా మీద అక్రమ కేసులతో తీహార్ జైల్లో ఉండి వచ్చాను.
  • ప్రజా సమస్యలపై మాట్లాడితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలా? పార్టీ పెద్దలు పునరాలోచించాలి.
  • బీసీ రిజర్వేషన్లపై నేను కాంగ్రెస్ పై వత్తిడి తీసుకువచ్చాను
  • సామాజిక తెలంగాణా అనడంలో తప్పేముంది?
  • నా తండ్రి చిటికెన వేలు పట్టుకుని ఉద్యమాలు నేర్చుకున్నాను.
  • కేసీఆర్ నుంచే సామాజికతెలంగాణా ఎజెండాను నేర్చుకున్నాను.
  • హరీష్ రావు, సంతోష్ రావులు నాపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారు.
  • బంగారు తెలంగాణా నినాదం కేసీఆర్ ఇచ్చిందే.
  • హరీష్ రావు, సంతోష్ ల ఇండ్లు బంగారమైతే బంగారు తెలంగాణా అయినట్టా?
  • అన్నా.. నేను నీ చెల్లిని.. అంటూ రామన్నను బతిలాడాను.
  • తెలంగాణా భవన్ లో కుట్రలు జరుగుతున్నాయని నేను అంటే రామన్న ఒక్క మాట మాట్లాడారా?
  • కేసీఆర్ బిడ్డకే అన్యాయంజరిగితే మాట్లాడరా?
  • నన్ను సస్పెండ్ చేయగానే ఐదుగురు మహిళలు మాట్లాడారు.నేనుకోరుకున్న అంతర్గత ప్రజాస్వామ్యం ఇదే.
  • నన్నుసస్పెండ్ చేస్తే తెగిపోయే బంధం కాదిది.
  • మా కుటుంబం విచ్ఛిన్నం కావాలన్నదే ఆ ఇద్దరి కోరిక.
  • నానా.. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతోందో చూసుకోండి నానా..
  • ముక్కుసూటిగా మాట్లాడడం వల్లే నన్ను బలి చేశారు.
  • రేపు రామన్నకు, కేసీఆర్ కు నా పరిస్థితే ఎదురవుతుంది.
  • బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకోవడమే వారి లక్ష్యం.
  • హరీష్ రావు, రేవంత్ లు ఒకే విమానంలో పయనించిన తర్వాతే మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర ప్రారంభమైంది.
  • హరీష్ రావు, రేవంత్ ల మధ్య రహస్య ఒప్పందం ఉంది.
  • అన్నా.. రామన్నా, హరీష్ రావు, సంతన్నలను పక్కనపెడితేనే పార్టీ బతుకుంది.
  • హరీష్ రావు టీఆర్ఎస్ లో మొదటి నుంచీ లేరు.
  • హరీష్ రావు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలవలేదా?
  • ట్రబుల్ షూటర్ కాదు..ట్రబుల్ క్రియేటర్ హరీష్ రావే.
  • చాలా మందికి చాలా రహస్య ఎజెండాలు ఉన్నాయి.
  • ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చే అవసరం హరీష్ రావుకు ఏమొచ్చింది?
  • రామన్నను ఓడించడానికి హరీష్ రావు ప్రత్యర్థులకు రూ. 65 లక్షలు ఇచ్చారు.
  • నన్ను బయటకు పంపితే పార్టీ బాగుంటదా?
  • ప్రాణం పోయినా కేసీఆర్ కు గాని, కేటీఆర్ కు గాని హాని జరగాలని కోరుకోను.
  • ఏ అడపిల్లా ఇట్ల కోరుకోదు.
  • ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కేసీఆర్ వంటి తండ్రి దొరుకుతడు?
  • కేసీఆర్ ఆరోగ్యాన్ని కాపాడండి. పార్టీని కాపాడండి. పార్టీ కార్యకర్తలను కాపాడాలని రామన్నను కోరుతున్నా.
  • ఆరడుగుల బుల్లెట్టు ఇవాళ నన్ను గాయపర్చింది. రేపు రామన్ననూ గాయపర్చవచ్చు.
  • రామన్నా.. జాగ్రత్తగా ఉండండి.
  • జగ్గారెడ్డి నుంచి రఘునందన్ రావు, విజయశాంతి, ఈటెల రాజేందర్ వంటి నాయకులు హరీష్ రావు వల్లే పార్టీకి దూరమయ్యారు.
  • దుబ్బాక ఓటమికి హరీష్ రావే కారణం.
  • రామన్నా.. మీరు కూడా స్కిల్ నేర్చుకోండి అన్నా..
  • రేవంత్, హరీష్ రావుల బంధం హుజురాబాద్ ఎన్నికల నుంచే ఉంది.
  • స్పీకర్ ఫార్మేట్ లోనే ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నా.
    నేను ఏ పార్టీలోనూ చేరడం లేదు.
    కేసీఆర్ నిర్ణయాన్ని ప్రశ్నించలేను.
  • నా భవిష్యత్తును కాలం నిర్ణయిస్తుంది.

Popular Articles