ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం సహా మంత్రులపై కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన మనుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గల ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులిచ్చారని, పదకొండు మంది ఎమ్మెల్యేలు గల నల్లగొండ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉంటే తప్పా? అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. అన్నదమ్ముల్లో ఇద్దరమూ సమర్ధులమేనని, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? అని ఆయన వ్యాఖ్యానించారు.
తనకు మంత్రి పదవిని ఇస్తామని మాట ఇచ్చారని, తాము ఇద్దరు అన్నదమ్ములమనే విసయం పార్టీలోకి తీసుకున్నపుడు తెలియదా? ఆలస్యమైనా సరే ఓపిక పడుతున్నా? అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన మాట నిజమేనని ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని బహిర్గతం చేసినందుకు భట్టికి రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు కూడా తెలిపారు.
