Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

కాంగ్రెస్ మీ సామ్రాజ్యం కాదు: సీఎం ధీమాపై భగ్గుమన్న కోమటిరెడ్డి బ్రదర్

పదేళ్లపాటు పాలమూరు బిడ్డ సీఎంగా ఉండడం ఖాయమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భగ్గుమన్నారు. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు. ‘రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు’ అని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు.

పాలమూరు బిడ్డనైన తాను పదేళ్లపాటు సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి నిన్న కొల్లాపూర్ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ షేర్ చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Popular Articles