Top 5 This Week

Related Posts

గురి తప్పిన నక్సల్స్ మందుపాతర: గాల్లోకి లేచిన పౌరుల సుమో

మావోయిస్టు నక్సలైట్ల మందుపాతర గురి తప్పింది. పోలీసుల వాహనంగా భ్రమించి పేల్చిన ఓ మందుపాతర వల్ల సామాన్యులు ప్రయాణిస్తున్న సుమో వాహనం గాల్లోకి లేచింది. కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా బాసగూడ-తారెం ప్రాంతంలోని రాజపేట సమీపాన నక్సలైట్లు ఈ చర్యకు పాల్పడ్డారు. మందుపాతర పేలిన ఉదంతంలో మహ్మద్ ఇక్బాల్, బలరామ్ ప్రధాన్ అనే వ్యక్తులు గాయపడగా, వారు ప్రయాణిస్తున్న వాహనం ధ్వంసమైంది. క్షతగాత్రులను చికిత్స కోసం తరలిస్తున్నామని బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ ప్రకటించారు.

మందుపాతర పేలిన ఘటనా స్థలం

Popular Articles