ఖమ్మం: తెలంగాణా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు బర్త్ డే సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయం కీలక ప్రకటనను విడుదల చేసింది. ఈనెల 15వ తేదీన మంత్రి తుమ్మల జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు జన్మదిన వేడుకల పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదని, పత్రికల్లో శుభాకాంక్షల ప్రకటనలు ఇవ్వవద్దని ఆయన క్యాంపు కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. మొదటినుంచీ ఆర్భాటాలకు దూరంగా ఉండే తుమ్మల మనస్సును ఇబ్బంది పెట్టే పనులు చేయవద్దని అందరికీ మనవి చేస్తున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం తన ప్రకటనలో కోరింది.

