Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

నెలకోసారి కొండరెడ్ల గ్రామాలకు వెళ్లండి: మంత్రి తుమ్మల

అడవిని నమ్ముకుని జీవించే కొండరెడ్ల గిరిజన కుటుంబాలకు అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా నెలకోసారి ఆ గ్రామాలను సందర్శించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సూచించారు. తద్వారా వారి సమస్యలను తెలుసుకుని జిల్లా కలెక్టర్, ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకొని వెళ్లి వారిని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకు వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పూసుకుంట గ్రామ మార్గానికి నాలుగు కోట్ల 18 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కల్వర్టులను మంత్రి ప్రారంభించారు.

ఈ కార్యక్రమానంతరం పూసుకుంటలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాలలో నివసించే కొండరెడ్ల గిరిజన గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక విద్యా వైద్యం, మౌలిక వసతుల కల్పనకు ఇబ్బందులు పడుతుండేవారన్నారు. వారి సమస్యలను దృష్టిలో పెట్టుకొని గత జనవరిలో అటవీ శాఖ అనుమతి తీసుకొని కల్వర్టుల నిర్మాణం కొరకు శంకుస్థాపనలు చేశామన్నారు. నేడు ఆ కల్వర్టులను ప్రారంభించి వర్షాకాలంలో ఈ గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూశామని, అలాగే బీటీ రోడ్డు పనులను కూడా త్వరగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఈ గ్రామాలకు కరెంటు సౌకర్యం, రోడ్డు నిర్మాణం చేపట్టడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏమైనా అడ్డంకులు సృష్టిస్తే సంబంధిత ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించుకోవాలని అన్నారు.

Popular Articles