Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

ప్రశాంత, పరిశుభ్ర ఖమ్మం: మంత్రి తుమ్మల

అభివృద్ధిలో ముందంజలో గల ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యతగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్ల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ లో గల పాండురంగాపురంలో మంత్రి శుక్రవారం పర్యటించి కోటి రూపాయలతో నిర్మించనున్న స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, పాండురంగాపురం ఒకప్పుడు ఖమ్మం నగరానికి దూరంగా ఉండేదని, కాలక్రమేణా అభివృద్ధి చెంది నేడు నగరంలో కలిసిపోయిందన్నారు.

ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల, రాజీవ్ యువ వికాసం వంటి పథకాలను అమలు చేయాలన్నారు. రోడ్డు వెడల్పు, డ్రైయిన్ నిర్మాణం వంటి అభివృద్ధి పనులు ప్రజలను ఒప్పించి చేయని పక్షంలో నగరవాసులు వరదల సమయంలో మరొకసారి ఇబ్బందులకు గురవుతారని మంత్రి తెలిపారు. యాభై సంవత్సరాల కాలం ఖమ్మం నగరం అభివృద్ధిని అంచనా వేస్తూ అవసరమైన త్రాగునీరు, రోడ్లు, ఇతర మౌళిక వసతులు కల్పన చేయాలన్నారు. వర్షాకాలం రానున్న నేపథ్యంలో మురికి కాల్వలను శుభ్రం చేయాలన్నారు.

ఖమ్మం నగరానికి చుట్టు పక్కల జాతీయ రహదారులు వచ్చాయని, రైల్వే కనెక్టివిటీ ఉందని, మంచి వైద్య సదుపాయాలు, విద్యా సంస్థలు ఏర్పడ్డాయని, వైద్య కళాశాల, స్టేడియం నిర్మాణం జరుగుతున్నాయన్నారు. నగరం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అందరిపై ఉందన్నారు. మతాలు, కులాల మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుకోవాలనుకునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల సూచించారు. ప్రజలంతా సోదరుల్లా కలిసి ఉంటేనే ఆనందంగా ఉంటామన్నారు.

Popular Articles