Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

ఖమ్మం మేయర్ అభ్యర్థిపై మంత్రి పువ్వాడ కీలక ప్రకటన

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థి ఎవరనే అంశంపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. తన సతీమణి పువ్వాడ వసంత లక్ష్మి మేయర్ బరిలో లేరని ఆయన వెల్లడించారు. తన సతీమణి మేయర్ అభ్యర్థిగా ప్రచారం జరిగిన నేపథ్యంలో మంత్రి సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ప్రకటన చేయడం గమనార్హం. కార్పొరేటర్ బరిలో కూడా వసంతలక్ష్మి ఉండరని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఖమ్మం తదుపరి మేయర్ ఎవరనే అంశంలో గత సెప్టెంబర్ నెలాఖరులోనే మంత్రి అజయ్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. అప్పుడు ఆయన ఏం చెప్పారో దిగువన చదవేయండి.

‘‘ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజయ్ మాట్లాడుతూ, తమ కుటుంబ సభ్యులు మేయర్ పదవికి పోటీ చేసే అవకాశం ఖచ్చితంగా లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబంలో తనతోపాటు తన తండ్రి రాజకీయాల్లో ఉన్నామని, పిల్లలు చదువుకుంటున్నారని చెప్పారు. తన ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొనడమే తప్ప, తన వదినకుగాని, తన భార్యకుగాని పోటీ చేసే ఆలోచన లేదన్నారు. మేయర్ గా ఎవరుండాలనే అంశాన్ని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి అజయ్ వివరించారు.’’

Popular Articles