ఏడున్నర గంటల షెడ్యూల్.. నాలుగు నియోజకవర్గాలు.. మొత్తం 13 కార్యక్రమాలు.. ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం ఐదున్నర గంటలకు తిరిగి సచివాలయానికి చేరిక.. ఇదీ తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం నాటి సుడిగాలి పర్యటన జరిగిన తీరు. కోదాడ, పాలేరు, మధిర, ఖమ్మం నియోజకవర్గాల్లో మంత్రి పొంగులేటి పర్యటించి ఆయా ప్రాంతాల్లో జరిగిన శుభ కార్యక్రమాలకు హాజరయ్యారు.
కోదాడ నియోజకవర్గంలోని మోతె మండలం గొల్లగూడెం, పాలేరు నియోజవకర్గంలోని కూసుమంచి, ధర్మతండా, నేలకొండపల్లి మండలం అమ్మగూడెం, ఖమ్మం రూరల్ మండలంలోని ఆరెకోడు తండా, కస్నాతండా, తనగంపాడు, తీర్థాల, కాచిరాజుగూడెం గ్రామాల్లో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గంలోని ఎస్ఆర్ హోమ్స్ లో, మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం కట్టకూరు, ముదిగొండ గ్రామాల్లో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు.

కాగా ముదిగొండ మండలం బాణాపురం, వల్లభి గ్రామాల్లో జరిగిన వివాహ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి సతీమణి మాధురి హాజరయ్యారు. పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఇంట్లో జరిగిన శుభకార్యంలో ఆమె బోనమెత్తారు.
