Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

బొక్కలో వేయిస్తా: ఖమ్మం ‘కామ్రేడ్స్’కు పొంగులేటి వార్నింగ్

ఖమ్మం: ఖమ్మం కామ్రేడ్స్ కు తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఫోన్ల ద్వారా తమ కార్యకర్తలను బెదిరిస్తే ఊర్కునేది లేదని, బొక్కలో వేయిస్తానని హెచ్చరించారు. పోలింగ్ ముగిసిన 11వ తేదీ తర్వాత సంగతి తేలుస్తానని వారిని హెచ్చరించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి పొంగులేటి ఈ హెచ్చరిక చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికల పొత్తు కుదరని పరిస్థితుల్లో, ఏదులాపురం, కొత్తగూడెంలలో కాంగ్రెస్, సీపీఐ వేర్వేరుగా పోటీచేస్తున్న పరిస్థితుల్లో మంత్రి పొంగులేటి చేసిన ఈ హెచ్చరిక రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ వ్యాఖ్యల సందర్భంగా పొంగులేటి సీపీఐ పేరును నేరుగా ఉటంకించకపోవడం గమనార్హం. పరోక్షంగా ఈ హెచ్చరిక వారిని ఉద్ధేశించి చేసినట్లుగానే పొలిటికల్ చర్చ జరుగుతోంది. ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మంత్రి పొంగులేటి చేసిన ఈ హెచ్చరికల వ్యాఖ్యలు ఉన్నది ఉన్నట్లుగా ఆయన మాటల్లోనే…

Popular Articles