Friday, October 17, 2025

Top 5 This Week

Related Posts

పాలేరులో మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మం: తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. ఇందులో భాగంగానే తిరుమలయపాలెం మండలం పాతర్లపాడు నుండి లకావత్ తండా వరకు రూ. 1.32 కోట్ల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా జోగులపాడు నుండి తిలావత్ తండా వరకు రూ. 90లక్షల అంచనా వ్యయంతో బీ టీ రోడ్డు అభివృద్ధి పనులకు, రూ. 10 లక్షల అంచనా వ్యయంతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి, జల్లేపల్లిలో రూ. 30 లక్షల అంచనా వ్యయంతో, హైదర్ సాయి పేటలో రూ. 10 లక్షల అంచనా వ్యయంతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

నేలకొండపల్లి మండలంలో కూడా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముజ్జుగూడెం నుండి గువ్వలగూడెం వరకు రూ.2.60 కోట్లు అంచనా వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణానికి, పైనంపల్లిలో రూ.15 లక్షల అంచనా వ్యయంతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో ఎక్కడా తగ్గనీయకుండా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు. పది సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డూ ఇవ్వని పరిస్థితిని మార్చి… ప్రభుత్వం ఏర్పడిన తరువాత అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చామని వివరించారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదమే ప్రభుత్వానికి బలం కావాలన్నారు. పాలిచ్చే గేదె లాంటి ఈ ప్రభుత్వం ప్రజల దీవెనలతో ముందుకు సాగుతుందని మంత్రి పేర్కొన్నారు.

Popular Articles