తెలంగాణా రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. గత నెల 22వ తేదీన పొంగులేటి తన కుటుంబంతో విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రయాణ సమయాన్ని మినహాయిస్తే దాదాపు 10 రోజులపాటు అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయంలో దిగనున్నారు.

