Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

పాలేరు యూటీ పనుల పూర్తికి మంత్రి డెడ్ లైన్

పాలేరులోని నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ ప్ర‌ధాన కాలువ అండ‌ర్ ట‌న్నెల్ ( యూటీ) నిర్మాణ ప‌నుల‌ను యుద్ద‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఎట్టిప‌రిస్ధితుల్లోనూ వ‌చ్చే జూలై 10వ తేదీ నాటికి పూర్తిచేసి వానాకాలం సీజ‌న్‌కు రైతాంగానికి నీటిని విడుద‌ల చేయాల‌ని ఆదేశించారు. కూసుమంచి మండ‌లం జుజ్జుల‌రావుపేట‌లో జ‌రుగుతున్న‌ పాలేరు సాగ‌ర్ కాలువ ప‌నుల‌ను మంత్రి శుక్రవారం ఆకస్మికంగా త‌నిఖీ చేశారు.

ఈ సంద‌ర్బంగా పొంగులేటి మాట్లాడుతూ, నిరుడు కురిసిన భారీ వ‌ర్షాల‌కు సెప్టెంబ‌ర్‌లో పాలేరు రిజర్వాయ‌ర్ ద‌గ్గ‌ర ప్ర‌ధాన కాలువ‌పై అండ‌ర్ ట‌న్నెల్ (యూటీ) కొట్టుక‌పోయింద‌న్నారు. రైతుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌తో అప్ప‌ట్లో తాత్కాలిక ఏర్పాట్లు చేసి సాగునీటిని అందించామన్నారు. శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న రూ. 14.20 కోట్లతో ఈ యూటీ కాలువ మ‌ర‌మ్మ‌తుల‌ను ప్రారంభించినట్లు చెప్పారు. వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అత్యంత ప్రాధాన్య‌తా క్రమంలో అవ‌స‌ర‌మైతే రోజుకు రెండు షిఫ్ట్‌ల క్ర‌మంలో ప‌నిచేసి గ‌డువులోగా నిర్మాణ‌ ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు.

Popular Articles