Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

రైతు భరోసాపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

రైతు భరోసాపై తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. సోమవారం నుంచి రైతు భరోసా నిధులను కర్షకుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే వారం రోజుల్లోనే అర్హులైన రైతు సోదరులందరికీ కుంట మొదలుకుని ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్ వారి వారి బ్యాంకు ఖాతాలలో జమా చేయనునట్లు చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం వ్యవసాయ పనుల్లో పాల్గొని నాగలి దున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోకవర్గంలో పర్యటించిన మంత్రి కూసుమంచి మండల కేంద్రంలో ఏరువాక నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆయన పాలె పట్టి, ఎడ్ల పగ్గం గుంజి, నాగలి దున్ని, పత్తి విత్తనాలు నాటారు. రైతులకు, వ్యవసాయ కూలీలకు మంత్రి ఈ సందర్భంగా ఏరువాక శుభాకాంక్షలు చెప్పారు.

ఈ నేపథ్యంలోనే రైతు భరోసాపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. రైతులు వ్యవసాయ పెట్టుబడి సాయం కోసం బ్యాంకుల చుట్టూ తిరగకుండా, షావుకార్ల వద్దకు వెళ్లకుండా ప్రభుత్వం సోమవారం నుంచి రైతు భరోసా నిధులను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించి వారం రోజుల వ్యవధిలోనే అందరికీ అందిస్తామని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో రైతు భరోసా నిధులను కర్షకుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

Popular Articles