Top 5 This Week

Related Posts

బచ్చాగా..! బచ్చాగాన్ని పెట్టి నిన్ను ఓడిస్తా: కేటీఆర్ కు మంత్రి పొంగులేటి వార్నింగ్

ఖమ్మం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గెలుపుపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పాలేరులో పొంగులేటి ఎలా గెలుస్తాడో చూస్తానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి స్పందించారు. ఈమేరకు గురువారం ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.

‘మీ నాయనే (కేసీఆర్) మూడుసార్లు ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడని, మీ నాయనే మూడుసార్లు పాలేరుకు వచ్చి ముక్కు నేలకేసి రాసినా ఏం చేయలేకపోయాడని, నువ్వెంత బచ్చాగాడివి.. అని మంత్రి పొంగులేటి నిప్పులు చెరిగారు. ‘నా మీద నువ్వు నిలబడతావా? నీ మీద బచ్చగాన్ని పెట్టి మళ్లీ పార్టీ గెలిపిస్తానో చూడాలని కూడా మంత్రి కేటీఆర్ కు సవాల్ చేశారు. ఇటువంటి అహంకారపు మాటల వల్లే ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పారన్నారు. మూడున్నరేళ్ల తర్వాత జరిగే ఎన్నికలనాటికి నువ్వు నిజంగానే ఇండియాలో ఉంటావో, బ్యాగూ, సంచీ సర్దుుని విదేశాలకు చెక్కేస్తావో నిర్ణయించడానికి తెలంగాణా ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ ను ఉద్ధేశించి మంత్రి పొంగులేటి అన్నారు.

Popular Articles