Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

పార్టీ లీడర్ పాడె మోసిన మంత్రి పొంగులేటి

పాలేరు: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడి పాడె మోశారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పాలేరుకు చెందిన యడవెల్లి రాంరెడ్డి అనే స్థానిక నాయకుడు రోడ్డు ప్రమాదంలో ఆకస్మిక మరణం చెందారు. రాంరెడ్డి అంత్యక్రియలు శనివారం పాలేరులో నిర్వహించారు. ఈ సందర్భంగా రాంరెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రి పొంగులేటి తీవ్ర భావోద్వేగానికి గురవడంతోపాటు అతని పాడెను మోశారు.

రాంరెడ్డి భౌతిక కాయానికి నివాళి అర్పిస్తున్న మంత్రి పొంగులేటి

పాలేరులో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేసి, తన వెన్నంటి నడిచి ఎన్నికల్లో తాను విజయం సాధించడంలో రాంరెడ్డి కీలక పాత్ర పోషించారని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాంరెడ్డి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటానని మంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. పార్టీ ఒక నిబద్ధత గల సీనియర్ నాయకుడిని కోల్పోయిందని, తన రాజకీయ ప్రయాణంలో రామిరెడ్డి పాత్ర మరువలేనిదని మంత్రి పొంగులేటి అతని సేవలను శ్లాఘించారు.

Popular Articles