Top 5 This Week

Related Posts

ధైర్యమే కరోనాకు మందు: మంత్రి ఎర్రబెల్లి

క‌రోనా బాధితులెవ‌రూ ఆందోళ‌న చెందొద్దని, కరోనా తీవ్రత తగ్గిందని రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ‘మీకేం కాదు, ధైర్యమే మనకు రక్ష, మీ అంద‌రికీ అండ‌గా నేనున్నాను, మనం ధైర్యంగా ఉందాం, కరోనా ను జయిద్దాం’ అని ఆయన అన్నారు. అన్ని ర‌కాల వైద్య స‌దుపాయాల‌తోపాటు, అంబులెన్స్, ఇత‌ర సౌక‌ర్యాల‌ను కూడా క‌ల్పిస్తున్నామన్నారు. నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు కూడా అందించాల‌ని స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌కు చెప్పానని, ఇంకా మీకు స‌మ‌స్య‌లుంటే, తనను గానీ, తన సిబ్బందిని గానీ, సంప్ర‌దించాల్సిందిగా ద‌యాక‌ర్ రావు కోరారు.‌ పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ క‌రోనా బాధితులు, వారి కుటుంబ స‌భ్యుల‌తో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గురువారం టెలీ కాన్ఫ‌రెన్సులో మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా గల క‌రోనా బాధితులు, ప్ర‌జాప్ర‌తినిధులు, వైద్యులు, పోలీసులు త‌దిత‌రుల‌తో మంత్రి మాట్లాడారు.

క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టిందని, క‌రోనా తీవ్ర‌త కూడా అంత‌గా లేదన్నారు. క‌రోనాతో భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదని, ధైర్యంగా ఉందామన్నారు. కొద్దిపాటి జాగ్ర‌త్త‌లు తీసుకుందామని, క‌రోనా బారి నుంచి కాపాడుకుందామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పారు. ఒక్కో పేషంట్ , వారి కుటుంబ స‌భ్యుల యోగ క్షేమాలు తెలుసుకుంటూనే, ఎక్క‌డ‌? ఎలా ఉంటున్నార‌ని ఆరా తీశారు. అలాగే, వారికి అండ‌గా ఉండాల‌ని స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌కు మంత్రి చెప్పారు. అవ‌సర‌మైన వైద్య ప‌రీక్ష‌లు, చికిత్స‌కు సంబంధించిన ఆదేశాల‌ను సంబంధిత జిల్లా వైద్యాధికారి, వైద్యుల‌కు జారీ చేశారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను మంత్రి మ‌రోసారి గుర్తు చేశారు. పోలీసు అధికారులు కూడా క‌రోనా బాధితుల హోం క్వారంటైన్, త‌గు స‌దుపాయాలు, మిగ‌తా స‌మాజం తీసుకోవాల్సిన సామాజిక దూరం, స్వీయ నియంత్ర‌ణ‌లు పాటించేలా చూడాల‌న్నారు. అలాగే, అంద‌రూ మాస్కులు ధ‌రించాల‌న్నారు. క‌రోనా త‌గ్గు ముఖం ప‌డుతున్నందున భ‌య‌ప‌డాల్సింది లేద‌న్నారు. ఈ టెలీ కాన్ఫ‌రెన్స్ లో నియోజ‌క‌వ‌ర్గ స్థాయి వైద్యాధికారులు, వైద్యులు, ప్ర‌జాప్ర‌తినిధులు, పోలీసులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Popular Articles