ఇద్దరు తెలంగాణా మంత్రుల మధ్య వ్యాఖ్యల వివాదం సరికొత్త పుంతలు తొక్కుతోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తనను ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని, రేపటి వరకు వేచి చూస్తానని, లేనిపక్షంలో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలని ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. పొన్నం ప్రభాకర్ చేసినట్లు వ్యాప్తిలోకి వచ్చిన ‘దున్నపోతు’ వ్యాఖ్య వివాదంలో పీసీసీ చీఫ్ కూడా జోక్యం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే పొన్నం ప్రభాకర్ తనపై వ్యాఖ్య చేసిన సందర్భంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పట్టించుకోకపోవడాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆక్షేపించారు. వివేక్ వెంకటస్వామి కొడుకు వంశీ ఎంపీగా పోటీచేస్తే తాము మీదేసుకుని గెలిపించుకున్నట్లు లక్ష్మణ్ పేర్కొన్నారు. వెంకటస్వామి కుటుంబానికి, తమకు ఎంతో రాజకీయ అనుబంధం ఉందన్నారు. పొన్నం ప్రభాకర్ వ్యాఖ్య వివాదంలో మంత్రి వివేక్ వెంకటస్వామి గురించి మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఇంకా ఏమన్నారో దిగువన గల వీడియోలో చూడవచ్చు..