Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

ఏనుగులు, సింహాలు కాదు సారూ… RNI గుర్తింపుతో చూడాలి!

పాలకుల్లో మీడియా పట్ల పక్షపాతం పెరుగుతోంది. మీడియాలో కూడా పాలకుల పట్ల పక్షపాతం పెరుగుతోంది.

ఈ రెండు పరిణామాలూ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.

గతంలో కంటే ఇప్పుడు పత్రికల, టీవీల సంఖ్య పెరిగింది. అందుకు అనుగుణంగానే మీడియా ప్రతినిధుల సంఖ్య కూడా పెరిగింది. ఇది వాస్తవమే.

ఒకప్పుడు చిన్న గదిలో జరిగే విలేకర్ల సమావేశం, ఇప్పుడు కళ్యాణ మంటపం లాంటి వాటిల్లో జరపాల్సి వస్తోంది.

అయితే అంతమాత్రాన నిర్వాహకులు, ప్రత్యేకించి ప్రభుత్వం, శాఖలు విలేకర్లను నియంత్రించడం అంగీకారం కాదు.

తాజాగా రాజమండ్రిలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్న సభకు మీడియాను విడగొట్టి, వివక్ష చూపినట్టుగా కొందరు మితృలు చెప్పారు. ఇది నిస్సందేహంగా వివక్షే.

ఇలాంటి వివక్ష చిన్నపత్రికలు, చిన్న టీవీల పట్ల కనిపిస్తోంది. చిన్న పత్రికలు, చిన్న టీవీల పట్ల స్పష్టమైన వివక్ష కనిపిస్తోంది. అందుకు అధికారులు, ఇతరులూ చెప్పే కారణాలు వారి వైపు నుండి చూస్తే సమర్ధనీయమే కావచ్చు, కానీ మీడియా వైపునుండి సమర్ధనీయం కాదు.

రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రం వద్ద నిరసన తెలుపుతున్న జర్నలిస్టులు

RNI గుర్తింపు ఉన్న ప్రతి పత్రికనూ ప్రభుత్వం సమదృష్టితో చూడాలి. చిన్నపత్రికల ప్రతినిధులను ఏ కారణంతో చిన్నచూపు చూస్తున్నారో, పెద్ద పత్రికలదీ అదే కారణం.

కాకపోతే చిన్న పత్రికల ప్రకటనల ఖర్చు (బిల్లు) వందల్లో ఉంటే పెద్ద పత్రికల ఖర్చు (బిల్లు) లక్షల్లో, కోట్లల్లో ఉంటుంది. చిన్న పత్రిక విలేకరి ఖర్చు వందల్లో ఉంటే పెద్దపత్రికల సంపాదకుడి ఖర్చు లక్షల్లో, కోట్లల్లో ఉంటుంది.

ఖర్చు అయినా, లంచం అయినా ఇంతే స్థాయిలో తేడా ఉంటుంది. కోట్లు తీసుకునే పెద్దపత్రిక యాజమాన్యానికి ఎర్రతివాచి వేసి, వంద తీసుకునే చిన్నపత్రిక యాజమాన్యానికి వివక్ష చూపించడం ఎంతవరకు సమంజసమో విజ్ఞులు ఆలోచించాలి.

ఏనుగులు, సింహాలుగా భావించి, భయపడి ఇచ్చే గౌరవం, కుందేళ్ళకు, జింకలకు ఇవ్వడం లేదు.

‘ఖర్చు’ ఎక్కువ ఆశించే పెద్దమీడియాకు, బాకా ఊదే మీడియాకు, రాజకీయ అజెండా ఉన్న మీడియాకు అగ్రతాంబూలం, ‘ఖర్చు’ తక్కువ ఉండే చిన్న మీడియాకు అవమానాలు.

ఇది సబబు కాదేమో… విజ్ఞులు ఆలోచించాలి.

-దారా గోపి @fb

Popular Articles