Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం దృశ్యాలు

మేడారం: తన కోసం వేచి చూస్తున్న అశేష భక్తజనులకు దర్శనమిచ్చేందుకు సమ్మక్క తల్లి చిలుకలగుట్ట నుంచి బయలుదేరింది. సమ్మక్క పూజారులు చిలుకలగుట్టకు వెళ్లి అమ్మవారిని తీసుకువస్తున్న ఉద్విగ్న, ఉత్కంఠభరిత సన్నివేశాన్ని కన్నులపండుగగా భక్తులు వీక్షిస్తున్నారు. సమ్మక్క తల్లి బయలుదేరగానే గౌరవసూచకంగా ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఏకే-47 ఆయుధంతో గాల్లోకి కాల్పులు జరిపారు. చిలుకల గుట్ట నుంచి వస్తున్న సమ్మక్కకు దారివెట అశేష భక్తజనం చేతులెత్తి దండం పెడుతూ కృపను ప్రసాదించాలని మొక్కుతున్నారు. రాత్రి పది గంటల సమయంలో సమ్మక్క తల్లి తన గద్దెపైకి చేరుకున్నారు.

సమ్మక్కను తీసుకువస్తున్న పూజారులు
సమ్మక్క రాక సందర్భంగా గాల్లోకి కాల్పులు జరపుతున్న ములుగు ఎస్పీ, పోలీసు అధికారుల భక్తిపారవశ్యం
వనదేవతను ఆహ్వానిస్తూ గాల్లోకి కాల్పులు జరుపుతున్న ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
సమ్మక్కకు స్వాగతం పలుకుతున్న భక్తజనం
చెట్లపైకి ఎక్కి సమ్మక్క రాకను వీక్షిస్తున్న భక్తులు
సమ్మక్క గద్దెకు చేరుకున్న తర్వాత దర్శనానికి వచ్చిన భక్తులు

Popular Articles