హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నీటిపారుదల శాఖకు చెందిన ఇంజనీర్లను బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. హైదరాబాద్ సర్కిల్ పరిధిలోని 60 మంది ఇంజనీర్లు సహా మొత్తం 106 మంది ఈఈలను, డీఈఈలను, ఏఈఈలను బదిలీ చేస్తూ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా మంగళవారం ఉత్తర్వు జారీ చేశారు. క్షేత్ర స్థాయిలో అనేక మంది ఇంజనీర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఎన్వోసీల జారీ అంశంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇంత భారీ సంఖ్యలో వివిధ స్థాయిల్లో గల ఇంజనీర్లపై బదిలీ వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.