సూర్యాపేటలో భారీ చోరీ ఘటన జరిగింది. పట్టణంలోని సాయి సంతోషి అనే జువెల్లరీ షాపులో దుండగులు చొరబడి 18 కిలోల బంగారంతోపాటు రూ. 22 లక్షల నగదును దోచుకువెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. గ్యాస్ కట్టర్ ద్వారా షాపు వెనుక భాగంలోని షట్టర్ ను తొలగించి లోనికి ప్రవేశించడం ద్వారా దుండగులు దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదు టీంల పోలీసులు దోపిడీకి పాల్పడిన దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
