తెలంగాణా-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీకి చెందిన 25 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య ఇంకా కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీకి ఇంకా భారీగా నష్టం జరిగే అవకాశమున్నట్లు పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఛత్తీస్ గఢ్ రాష్టంలో విధులు నిర్వహిస్తున్న DRG, CRPF, COBRA, STF తదితర విభాగాలకు చెందిన భద్రతా బలగాలు ‘ఆపరేషన్ కర్రెగుట్ట’ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బుధవారం భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన భీకరపోరులో 25 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
