Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

భద్రాద్రి జిల్లాలో భారీ సైబర్ క్రైం: 13 మంది అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ సైబర్ క్రైం ఘటనను టేకులపల్లి పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో 13 మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 12 సెల్ ఫోన్లను, బ్యాంక్ పాస్ పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనలోని నిందితుల నిర్వాకంపై 108 ఫిర్యాదులు ఉండగా, రూ. 8.5 కోట్ల మేర సైబర్ నేరాల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఈ సైబర్ క్రైం ఘటన పూర్వాపరాలను మీడియాకు వివరించారు. ఇల్లెందు నియోజకవర్గం టేకులపల్లిలో మీ-సేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్న బోడా శ్రీధర్ అనే వ్యక్తికి టెలీగ్రామ్ యాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు పరిచమయ్యారు. ఇతరులకు నగదును బదిలీ చేస్తే కమీషన్ చెల్లిస్తామని చెప్పడంతో శ్రీధర్ తోపాటు టేకులపల్లికి చెందిన మరో 12 మంది చదువుకున్న యవకులు నకిలీ ధ్రువపత్రాలతో 60 కరెంట్ బ్యాంకు ఖాతాలను తెరిచారు. వీటి ద్వారా ఇతరుల బ్యాంకు ఖాతాల్లోకి నగదును పంపిస్తూ, కమీషన్లు పొందుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. గడచిన ఆరు నెలలుగా ఈ విధంగా మొత్తం రూ. 8.5 కోట్ల లావాదేవీలను నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ నేపథ్యంలోనే నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా జిల్లా సైబర్ సెక్యూరీటీ బ్యూరోకు అందిన ఫిర్యాదులపై టేకులపల్లి పోలీసులు రంగప్రవేశం చేశారు. టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో లోతుగా దర్యాప్తు జరిపి సైబర్ నేరాలకు పాల్పడుతున్న మొత్తం 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును చాకచక్యంగా విచారించి నిందితులను అరెస్ట్ చేసిన టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణను, ఎస్ఐ రాజేందర్ ను, సైబర్ క్రైం సీఐ జితేందర్ ను, ఇతర సిబ్బందిని ఎస్పీ రోహిత్ రాజ్ ఈ సందర్భంగా అభినందించారు.

అరెస్టయిన నిందితుల వివరాలు:
A1. Boda Sridhar S/o Mangilal, 27 Yrs, Lambada, Net center R/o H No. 1-42, Boda Bazar of Tekulapally Mandal.

A2. Boda Rajesh S/o Ranga, 25 Yrs, Lambada, Private Job R/o H No. 81-20-1. Rampuram village of Tekulapally Mandal.

A3. Boda Rajanna, S/o Mancha, 22 Yrs, Lambada, Private Job R/o H No. 1-256/40, Sevalal temple area, Tekulapally village & Mandal.

A4. Banoth Jagadeesh S/o Lalsingh, 27 Yrs, Lambada, Agril R/o H No. 2-131, Singya Thanda of Tekulapally Mandal.

A5. Tejavath Naresh S/o Kishan, 25 Yrs, Lambada, Private Job R/o Billudu Thanda of Tekulapally Mandal.

A6. Polepongu Pavan Kalyan S/o Venkanna, 27 Yrs, Madiga, Private Job R/o H No. 2-180/b, Ramalayam street, Tekulapally village & Mandal.

A7. Bhukya Veeranna S/o Balaji, 26 Yrs, Lambada R/o Baddhu Thanda of Tekulapally Mandal.

A8. Jatoth, Naresh S/o Shankar, 24 Yrs, Lambada, Student R/o H No. 3-44, Patha Thanda of Tekulapally Mandal.

A9. Boda Jampanna S/o Mancha, 25 Yrs, Lambada, Private Employee R/o Tekulapally village & Mandal.

A10. Boda Rajaram S/o Ranga, 27 Yrs, Lambada, Student R/o H No. 81-20-1, Rampuram Thanda village of Tekulapally Mandal.

A11. Bhukya Praveen S/o Balaji, 24 Yrs, Lambada, Agril R/o Baddu Thanda of Tekulapally Mandal.

A12. Maloth Praveen S/o Bheem Singh, 24 Yrs, Lambada, Student R/o H No. 18-20/a, Maddirala Thanda of Tekulapally Mandal.

A13. Urimalla Bharath Krishna S/o Shankara Chary (Late), 27 Yrs, Vishwa Brahmina, Internet & Mobile shop R/o H No. 1-27/1, Tekulapally village & Mandal.

Popular Articles