ఢిల్లీ: ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో పది మంది మృతి చెందగా, 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్- 1 వద్ద పార్కింగ్ ప్లేస్ లో నిలిపి ఉంచిన ఓ కారులో ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది. పేలుడు తీవ్రతకు ప్రాణాలు కోల్పోయినవారి దేహాలు ఛిద్రమయ్యాయి. ఘటనా స్థలానికి ఏడు అగ్నిమాపక వాహనాలు చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. ఇదే పేలుడులో మరో పది వరకు వాహనాలు దెబ్బ తిన్నాయి. క్లూస్ టీంలు, ఎన్‌ఐఏ బలగాలు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాయి.
కాగా ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు నగరాలను కేంద్ర హోం శాఖ అప్రమత్తం చేసింది. హైదరాబాద్, ముంబయి వంటి ముఖ్య నగరాల్లో పోలీసులు అలెర్టయ్యారు. అనుమానిత ప్రాంతాల్లో గస్తీ, తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ పేలుడు ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంకోవైపు ఐబీ డైరెక్టర్ నుంచి ఆరా తీస్తున్నారు.

