Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

చర్చలకు నక్సల్స్ పిలుపు!

మావోయిస్టు నక్సలైట్లు శాంతి చర్చలకు ఆహ్వానం పలికారు. ఈమేరకు ఆ పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఓ ప్రకటన విడుదల చేశారు. తాము శాంతి చర్చలను కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఇందుకు మూడు షరతులను ప్రభుత్వం అంగీకరించాల్సి ఉందని పేర్కొన్నారు. దండకారణ్యంలో సాయుధ బలగాలను తొలగించాలని, జైళ్లలో గల మావోయిస్టు నేతలను విడుదల చేయాలని, తమ సంస్థపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని నక్సల్ నేత డిమాండ్ చేశారు ఆయా మూడు ప్రధాన డిమాండ్లకు అంగీకరిస్తే ప్రభుత్వంతో తాము శాంతి చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ సామాజిక కార్యకర్త సుబ్రన్షు చౌదరి చేసిన దండిమార్చి-2 యాత్ర అనంతరం మావోయిస్టులు చర్చలకు సంబంధించి షరతులతో కూడిన ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

Popular Articles