Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

మావోయిస్ట్ అగ్రనేత సుదర్శన్ లొంగుబాటు

ఛత్తీస్ గఢ్: మావోయిస్ట్ పార్టీకి చెందిన మరో అగ్రనేత ఛత్తీస్ గఢ్ పోలీసులకు లొంగిపోయారు. ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ అలియాస్ వికాస్ సహా 15 మంది మావోయిస్టులు ఆయుధాలతో పోలీసులకు లొంగిపోయారు. తెలంగాణాలోని హన్మకొండ జిల్లా తరాలపల్లికి చెందిన సాంబయ్య ప్రస్తుతం ఒడిషా రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడుగా వ్యవహరిస్తున్నారు. మహాసముండ్ లోని సరైపాలిలో గల బలోడా అడవుల నుంచి ఓ జర్నలిస్ట్ సంప్రదింపుల సహకారంతో సాంబయ్య టీం పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.

ముప్పిడి సాంబయ్య (ఫైల్ ఫొటో)

లొంగిపోయినవారిలో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు సాంబయ్యతోపాటు ఇద్దరు బలంగీర్-బరగఢ్-మహాసముంద్ (బీబీఎం) డివిజనల్ కమిటీ సభ్యులు, ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు, ఏడుగురు ప్లాటూన్ సభ్యులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మూడు AK-47 రైఫిల్స్, రెండు SLR, మూడు .303 రైఫిల్స్, మూడు 12 బోర్ గన్ లు, రెండు INSAS రైఫిల్స్, ఒక 14 మస్కెట్ (మ్యాగజైన్ లేని .303 రైఫిల్) ను పోలీసులకు స్వాధీనం చేశారు.

Popular Articles