Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

ఓబీలో రికార్డ్ తిరగరాసిన సింగరేణి పీకే ఓసి-2

సింగరేణి ఓపెన్ కాస్ట్-2 ఓబీలో తన రికార్డును తానే బద్దలు కొట్టింది. మణుగూరులోని ప్రకాశం ఖని ఓసి-2 గని ఓబీలో రికార్డ్ సృష్టించింది. గురువారం ఒక్క రోజులో లక్షా నాలుగు వేల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తీసి పీకే ఓ సి 2 గని మరోసారి తన సత్తాను చాటింది. సాధారణంగా మూడు షిఫ్టులలో కలిపి రోజువారీ టార్గెట్ 62,000 క్యూబిక్ మీటర్ల ఉండగా, గురువారం ఒక్కరోజు 22.5 గంటల్లో (1,04,000) అక్షరాలా లక్షా నాలుగు వేల క్యూబిక్ మీటర్ల ఓబీ తీసిన మైన్ గా పీకే ఓసి 2 ఘనత సాధించింది. తన రికార్డు ను తానే పీకే ఓసీ-2 బద్దలు కొట్టడం విశేషం.

గత నాలుగేళ్లుగా వరుసగా బెస్ట్ పర్ఫ్మార్మెన్స్ అవార్డును పీకే ఓసీ-2 అందుకుంటోంది. ప్రస్తుత రికార్డుతో మరోసారి.. అంటే ఐదోసారి కూడా ఈ మైన్ అవార్డును అందుకోనుంది. అధికారుల, కార్మికుల సమిష్టి కృషితో ఇది సాధ్యమైంది. ఈ అంశంలో సింగరేణి సీఅండ్ఎండీ బలరాం కార్మికులను, అధికారులను, యూనియన్ ప్రతినిధులను ప్రశంసిస్తూ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అదేవిధంగా సింగరేణి డైరెక్టర్ఈ అండ్ ఎం డి.సత్యనారాయణ రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వీ. సూర్యనారాయణ, డైరెక్టర్ పీ.పీ కే. వెంకటేశ్వర్లు,
మణుగూరు ఏరియా జీఎం రాంచందర్ , అధికారులను, కార్మికులను, యూనియన్ ప్రతినిధులను అభినందించారు. ప్రత్యేకంగా పీకే ఓసి 2 ప్రాజెక్ట్ ఆఫీసర్ లక్ష్మీపతి గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Popular Articles