Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

NEXT నేనే…! పుట్ట మధుపై మాజీ ఉప సర్పంచ్ ఆరోపణ

పుట్ట మధు టార్గెట్ లో ఇప్పుడు తన వంతు వచ్చిందని మంథని మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సతీష్ సంచలన ఆరోపణలు చేస్తూ వీడియోను విడుదల చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత మంథని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్ పుట్ట మధు నలుగురు వ్యక్తులపై ఆరోపణలు చేశారన్నారు. అందులో మొదటి వ్యక్తి ఎడ్ల శ్రీనుపై పీడీ యాక్టు నమోదు చేయించి అతని నోరు నొక్కారన్నారు. అదే కేసును సాకుగా చూపి రెండో వ్యక్తి ఉప్పట్ల శ్రీనివాస్ ను రెండో సామ, దాన, భేద, దండోపాయాల ద్వారా పార్టీలో చేర్చున్నారన్నారు.

మూడో వ్యక్తి, న్యాయవాది గట్టు వామన్ రావును దారుణంగా హత్య చేయడం జరిగిందన్నారు. పుట్ట మధు ఓటమిలో తాము నలుగురం పాలుపంచుకున్నామనే కక్షతో చేస్తున్న కార్యక్రమాల్లో మిగిలి ఉన్న తనకు కూడా ప్రస్తుతం ప్రాణభయం ఏర్పడిందన్నారు. అందువల్ల తనకు రక్షణ కల్పించాలని మీడియా ద్వారా రాష్ట్ర డీజీపీని కోరుతున్నానని, ఆయనను స్వయంగా కలిసి వినతి పత్రం ఇవ్వనున్నట్లు కూడా సతీష్ తన వీడియో సందేశం ద్వారా ప్రకటించారు. అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్యోదంతపు ఆందోళనలు రెట్టింపవుతున్న నేపథ్యంలోనే మంథని మాజీ ఉప సర్పంచ్ సతీష్ వ్యక్తం చేస్తున్న ఆందోళన సంచలనం కలిగిస్తోంది. వీడియలో సతీష్ ఇంకా ఏమన్నారో… దిగువన చూసేయండి.

Popular Articles