Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

మగానుభావుడి ఆడ ‘వేషాలు…’ కరీంనగర్ లో చితక బాదేశారు

ఆడ వేషంలో మహిళలతో చనువుగా ఉంటున్న ఓ వ్యక్తిని స్థానికులు చితకబాదిన ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. కరీంనగర్ కు చెందిన దాదాపు 50 ఏళ్ల వయస్సు గల పురుషుడు గత కొంత కాలంగా చీర, జాకెట్ ధరించి మహిళలతో చనువుగా ఉంటున్నాడట. ఇటీవలే హౌజింగ్ బోర్డు కాలనీలో అద్దెకు దిగిన ఇతనిపై స్థానికులకుఎందుకో అనుమానం కలిగింది. అతని నడవడిక, కదలికలపై నిఘా వేసిన స్థానికులు అతను మహిళ కాదని, ఆడవేషంలో ఉన్న పురుషుడేనని గ్రహించారు. ఆగ్రహించిన స్థానికులు అతన్ని బయటకు లాగి చెట్టుకు కట్టేసి మరీ దేహశుద్ధి చేశారు.

అయితే ఈ వ్యక్తి మహిళా వేషధారణను ఎందుకు ఎంచుకున్నాడనే అంశంపై ఇతమిద్ధ సమాచారం లేదు. ఒకప్పుడు కరీంనగర్ పట్టణంలో ఆటో నడిపిన వ్యక్తిగా అనుమానిస్తున్న ఇతను హిజ్రా కూడా కాదంటున్నారు. హౌజింగ్ బోర్డు కాలనీ వాసులు ఇతని ఆడ ‘వేషా’లను పసిగట్టి దేహశుద్ది చేసిన ఘటన స్థానికంగా చర్చకు దారి తీసింది.

Popular Articles