Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

జపాన్ లో 7.6 తీవ్రత భూకంపం: సునామీ హెచ్చరిక జారీ

టోక్యో: జపాన్ లో సోమవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 7.6గా నమోదైనట్లు, యైనైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికను జారీ చేసినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదించాయి. భూకంపం అనంతరం జపాన్ ఈశాన్య తీరాన్ని మూడు మీటర్ల (10 అడుగులు) ఎత్తులో సునామీ తాకే అవకాశాలు ఉన్నట్లు జపాన్ వాతావరణ శాఖను ఉటంకిస్తూ కూడా అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

USGS ప్రకారం.. 14:15 (UTC) వద్ద 53.1 కి.మీ లోతులో భూకంపం నమోదైంది. ఉత్తర జపాన్‌లోని మిసావా నగరానికి తూర్పు-ఈశాన్యంగా 73 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఇది అమోరి, హక్కైడో తీరంలో తాకినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఆ ప్రాంతానికి సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తోంది. జపాన్ ఉత్తర, తూర్పు ప్రాంతాలలో భూకంపం సంభవించిన తర్వాత, హక్కైడో, అమోరి, ఇవాటే ప్రిఫెక్చర్లకు సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.

Popular Articles