Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

మావోయిస్ట్ నేతకు ఎస్పీ నివాళి!

నిషేధిత మావోయిస్టు పార్టీ అగ్ర నేత ఒకరికి ఐపీఎస్ అధికారి నివాళులర్పించారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. హరిభూషణ్ స్వగ్రామమైన మడగూడెం వెళ్లిన మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆయనకు నివాళులర్పించారు. హరిభూషణ్ చిత్రపటానికి పూలు చల్లి శ్రద్ధాంజలి ఘటించారు. నిరు పేదరికంలో గల హరిభూషణ్ కుటుంబ ఆర్థిక పరిస్థితులను గమనించిన ఎస్పీ కోటిరెడ్డి దశదిన కర్మ ఖర్చులను కూడా భరించి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిసింది. హరిభూషణ్ కుటుంబ సభ్యులను ఎస్పీ కోటిరెడ్డి ఈ సందర్భంగా పరామర్శించారు.

హరిభూషణ్ కుటుంబ సభ్యులతో ఎస్పీ కోటిరెడ్డి

Popular Articles