వంట గ్యాస్ సిలిండర్ మరింత భారమైంది. గృహ అవసరాలకు వినియోగిస్తున్న 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ పై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ధరకు మరో రూ. 50 పెంచింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ ప్రకటించారు. పెంచిన ధర ఉజ్వల పథకం లబ్ధిదారులకూ వర్తిస్తుందని కూడా పేర్కొన్నారు.
వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరను గత వారంలో 41 రూపాయల మేరకు తగ్గించిన విషయం విదితమే. అయితే రాష్ట్రాల వారీగా ఈ తగ్గింపులో మార్పులు ఉంటాయని కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం పెట్రోల్, డీజిల్ పై రూ. 2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం పెంచింది. కానీ ఈ భారం చమురు మార్కెటింగ్ కంపెనీలే భరిస్తాయని వెల్లడించింది. కాగా పెరిగిన ధరలు రేపటి (ఏప్రిల్ 8) నుంచి అమలులోకి వస్తాయని కేంద్రం తన నోటిఫికేషన్ లో తెలిపింది.