గడ్చిరోలి: మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ సహా లొంగిపోయిన 61 మంది నక్సలైట్ల జాబితా విడుదలైంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పోలీసులకు మల్లోజుల సహా 61 మంది నక్సలైట్లు నిన్న లొంగుబాటను ఆశ్రయించిన విషయం విదితమే. అయితే లొంగుబాటును ఎంచుకున్న ఆయా మొత్తం నక్సలైట్లు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో బుధవారం అధికారికంగా లొంగిపోయారు.
జాబితా ప్రకారం మహారాష్ట్ర పోలీసులకు లొంగిపోయినవారిలో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, ఇద్దరు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, ఒకరు డిప్యూటీ కమాండర్లు, ఆరుగురు ఏరియా కమిటీ సభ్యులు, 16 మంది పీపీఎం సభ్యులు, 25 మంది పీఎంలు ఉన్నారు.
మల్లోజుల వేణుగోపాల్ తోపాటు మరో 60 మంది నక్సలైట్లు తుపాకులతో లొంగిపోవడం గమనార్హం. అధునాతన ఏకే-47, ఇన్సాస్, ఎస్ఎల్ఆర్, 12 బోర్, 303, 8ఎంఎం, బీజీఎల్, కార్బైన్ తదితర ఆయుధాలతో లొంగిపోయారు. లొంగిపోయిన మొత్తం నక్సలైట్ల జాబితాను దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లో చూడవచ్చు.