Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ఆపండి… ‘ప్రాజెక్టులు’

వివాదాస్పద ప్రాజెక్టుల పనులు నిలిపివేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రాజెక్టులపై తెలంగాణా ప్రభుత్వం రాసిన లేఖకు బోర్డు స్పందిస్తూ ఓ లేఖ కూడా రాసింది. ఇందులో భాగంగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలని నిర్దేశించింది.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) గత ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశాల్లో రాయలసీమ లిఫ్ట ఇరిగేషన్ పనులు చేపట్టవద్దని స్పష్టంగా చెప్పారని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తన లేఖలో ప్రస్తావించింది. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పిర్యాదు చేసిందని, అయితే డిపీఆర్ లు సమర్పించి ఆమోదం పొందే వరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో ముందుకు వెళ్లొద్దని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు స్పష్టం చేసింది.

Popular Articles