దశాబ్ధాలుగా ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్న జర్నలిస్టులు తమ హౌజింగ్ సొసైటీలను చట్టబద్ధంగానే నిర్వహిస్తున్నారా? కనీసం ఏడాదికోసారైనా సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారా? సభ్యత్వ నమోదు, తదితర అంశాల్లో సహకార చట్టం నిబంధనలను కనీసం పాటిస్తున్నారా? ఇటువంటి అనేక ప్రశ్నలపై సహకార శాఖకు చెందిన అధికారి చంద్రకిరణ్ కీలక సమాచారంతో కూడిన సమాధానాలిచ్చారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన జూబ్లీహిల్స్ జర్నలిస్టు కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ ప్రత్యేక సర్వసభ్య సమవేశంలో చంద్రకిరణ్ పాల్గొన్నారు.
సొసైటీలకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం జర్నలిస్టులకు ప్రభుత్వపరంగా ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రశ్నార్థకంగానే మారిందని చెప్పాలి. పాలకులు సైతం ఈ విషయంలో పెద్దగా ఆసక్తి కనబరుస్తున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో నిర్వహించిన హైదరాబాద్ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ (JCHSL) జనరల్ బాడీ మీటింగ్ ఆసక్తికర చర్చకు దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పేర్లతో ఉన్నటువంటి అనేక జర్నలిస్టు హౌజింగ్ సొసైటీలు చట్టబద్ధంగానే నిర్వహిస్తున్నారా? అనే ప్రశ్న తాజాగా రేకెత్తుతోంది. ఇంతకీ JCHSL మీటింగులో చంద్రకిరణ్ ఏం చెప్పారనేది ప్రతి జర్నలిస్టు తెలుసుకోవలసిన అవసరముంది.

పలువురు సీనియర్ జర్నలిస్టులు అడిగిన అనేక ముఖ్య ప్రశ్నలకు చంద్రకిరణ్ చెప్పిన సమాధానాలను దిగువన గల వీడియోలో చూడవచ్చు.

