Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

డియర్, ఆంధ్రా కామ్రేడ్స్…!

‘ఉద్యమాలే ఊపిరిగా’ అని విన్నప్పుడు ‘ప్రజల పక్షాన పోరాటమే లక్ష్యం’ అనుకునేవాడిని. చాలా మంది అలాగే అనుకుంటూ ఉంటారు. అమరావతిని రాజధానిగా వద్దన్న వారిలో వామపక్షాల నేతలూ ఉన్నారు.

పంట భూముల విధ్వంసం వద్దన్నారు. రైతుకూలీలు, కౌలు రైతులు, చిన్న, సన్నకారు రైతులకు నష్టం అన్నారు. పోరాటాలు చేశారు. ఐదేళ్ళు గడిచిపోయాయి. పాలకపక్షం మారింది. అయినా ‘ఉద్యమాలే ఊపిరిగా’ సూత్రం కొనసాగుతోంది. అమరావతే రాజధానిగా కావాలని ఇప్పటి పోరాటం.

సమస్య ఏదైతేనేం… సమస్య ఎవరిదైతేనేం… కలిసొచ్చేది ఎవరైతేనేం… పోరాటం కావాలి… ఉద్యమాలే ఊపిరిగా నిరంతరం అలా సాగిపోదాం…

నిన్నటి నియంత నేడు ప్రజాస్వామ్యవాది అయ్యాడా? లేక నేటి నియంతతో మన బంధం తెగిపోయిందా… నిన్నటి చే గువేరా శిష్యుడు నేడు సావర్కర్ శిష్యుడు అయినా ఫర్లేదా… మరోసారి సావర్కర్ ని వదిలి వస్తే దోస్తీ చేద్దామా… నేటి నియంత రేపు మళ్ళీ పిలిస్తే పరుగెట్టుకెళ్ళి కలుద్దామా…

ఎలాగైతేనేం…
ఏదైతేనేం …
ఎవరిదైతేనేం…
ఉద్యమాలే ఊపిరిగా సాగిపోదాం…
పోరాటాలే అజెండాగా అడుగులేద్దాం…

-దారా గోపి @fb

Popular Articles