ఇరాన్ లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ఎవరూ అదుపు చేయలేని స్థాయికి చేరుకున్నాయి. ఏ క్షణమైనా ప్రభుత్వం కుప్పకూలే సూచనలు కనిపిస్తున్నాయి. నాలుగు రోజులుగా ఇంటర్నెట్ నిలిపివేయడంతో ప్రజలకు, ముఖ్యంగా యువతకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. మరో వైపు మత పాలకుడు అలీ ఖమేనీ గత రెండు వారాలకు ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఆయన తన కుటుంబం, సన్నిహిత సహచరులతో రహస్యంగా మాస్కో వెళ్లిపోతారని ప్రచారం జరుగుతోంది. ఇరాన్ లో నెలకొన్న ఆందోళన పరిస్థితులు మారణహోమంగా మారి ఇప్పటికే 2,571 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు తాజా సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్ పరిస్థితిపై తాజా విశ్లేషణ ఇదీ:
- ఇరాన్ జనాభా 9 కోట్లు. 31 రాష్ట్రాలు. రాజధాని టెహ్రాన్ జనాభా 96 లక్షలు.
- ఇటీవల ఇజ్రాయెల్, అమెరికాల వైమానిక, మిస్సైల్ దాడుల్లో ఇరాన్ నిర్మిస్తున్న న్యూక్లియర్ ఎన్ రిచ్ మెంట్ ( యురేనియం నాణ్యత పెంచే) కేంద్రాలను ధ్వసం చేశాయి.
- మొదట ఇరాన్ సైన్యం వందల సంఖ్యలో మిస్సైళ్లతో ఇజ్రాయిల్ పై దాడి చేసింది.
- దానికి ధీటుగా అత్యంత శక్తివంమైన సైన్యం ఉన్న ఇజ్రాయెల్ భారీ దాడులకు పూనుకున్నది.
- ఖతార్ లోని అమెరికా సైనిక స్థావరం పైనా ఇరాన్ మిస్సైల్ల వర్షం కురిపించింది. వాటిని గాలిలోని అడ్డుకోవడంతో పెద్ద నష్టం ఏమీ జరగలేదని అమెరికా ప్రకటించింది.
- ఇరాన్ అంతటా జలాశయాలు అడుగంటడంతో రాజధాని టెహ్రాన్ తో పాటు దేశమంతటా మంచినీటి సరఫరా దాదాపుగా నిల్చిపోయింది.
- నాలుగేళ్లుగా వర్షాలు పడక పోవడంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయి.
- ఇది ప్రజల నిరసనకు ప్రధాన కారణమైంది.
- ఒక లీటర్ పెట్రోలు ధర కంటే నీటి సీసాల ఖరీదు 15 రెట్లు పెరిగాయి. నీటిని కూడా బ్లాక్ లో కొనాల్సిన దుస్థితి.
- విద్యుదుత్పత్తి తగ్గి కరెంటు రోజులో సగం కూడా కరెంటు అందడం లేదు.
- ఆందోళనలు ఉధృత మయ్యాక ప్రజలు ఒకరినొకరు కలసుకోకుండా రాత్రి పూట 8 గంటల నుంచి సైన్యం ఆదేశాలకు మేరకు కరెంటు సప్లయి నిలిచిపోతోంది.
- రాత్రి ఉష్ణోగ్రతలు 5 నుంచి 2 డిగ్రీల సెల్సియస్ కు పడిపోగా హీటర్లు లేక గడ్డకట్టే చలికి తట్టుకోవడం ప్రజలకు ప్రాణాంతకంగా మారింది.
- మిలటరీ కాల్పుల్లో 550 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సెల్ ఫోన్లు పనిచేయక పోవడం, వీధి దీపాలు వెలగక పోవడంతో తమ కుటుంబ సభ్యుల భద్రత గురించి ప్రజల్లో ఆందోళన మరింత తీవ్ర మైంది.
- పెద్ద నగరాలైన టెహ్రాన్, మష్షాద్, ఇస్ఫహాన్ నగరాల్లో ఒక్కో చోట పది లక్షల మందికి పైగా నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు.
- టెహ్రాన్ లోని ఇమామ్ ఖొమేనీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు అంతర్జాతీయ విమాన సంస్థలు ఫ్లయిట్లను నిలిపివేశాయి.
- ఇంటర్నెట్ లేక పోవడం కూడా దీనికి ఒక కారణం.
- విదేశాల్లో ఉన్న ఇరానియన్ పౌరులు పంపించించిన రిసీవర్ బాక్సులతో ఎలన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్లనుంచి ఇంటర్నెట్ సర్వీసులు తీసుకున్న వాళ్లు సైన్యం భయానికి వెనక్కుతగ్గారు.
- డెత్ టూ (మత పాలకుడు) అలీ ఖమేనీ, ప్రవాసంలో (అమెరికా)లో ఉన్న యువరాజు రెజా పహ్లవీ కలకాలం జీవించాలి అనే నినాదాలు మార్గోతున్నాయి.
- తమ పిల్లల భవిష్యత్తును ఫణంగా పెట్టి ఇజ్రాయిల్ పై దాడి చేసేందుకు హమాస్, హిజ్బొల్లా, హూతీ సాయుధ మిలిటెంట్ గ్రూపులకు లక్షల కోట్ల డాలర్లు అందజేసిందని ప్రభుత్వం ఆగ్రహం పెల్లుబుకుతోంది.
- ఒక్క అమెరికల్ డాలర్ కు 9.97 లక్షల రియాల్స్ గా మారకం రేటు పతనమైంది.
- అమెరికా ఆంక్ష్లలతో ముడి చమురు అమ్మకాలు పరిమితమై పోగా, మరో వైపు అణు బాంబు నిర్మాణంపై పూర్తి దృష్టిని కేంద్రీకరించడం ప్రజా జీవితాన్ని సంకటంలోకి నెట్టింది.
- తమ సైన్యంపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు దాడి చేసి విముక్తి కల్పించాలని ప్రజలు కోరడం అక్కడ పరిస్థితులకు అద్దం పడుతోంది.

✍️బి.టి. గోవిందరెడ్డి

