Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

లంకె బిందె లభ్యం

జనగామ జిల్లా పెంబర్తిలో లంకె బిందె లభ్యమైంది. నరసింహా అనే వ్యక్తి తాను కొనుగోలు చేసిన 11 ఎకరాల భూమిని చదును చేస్తుండగా లంకె బిందె బయల్పడింది. విషయాన్ని నరసింహా పోలీసులకు చేరవేశారు. దీంతో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఏసీపీ వినోద్ కుమార్, ఎస్ఐ రవికుమార్ తదితరుల ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణులను పిలిపించి లంకె బిందెను పరిశీలన చేయించారు. లంకె బిందెలో 5 కిలోల బంగారం ఉన్నట్లు ప్రచారం జరిగినప్పటికీ, 17 తులాల బంగారం, 10 కిలోల వెండి లభ్యమైనట్లు ఇంకోవైపు వార్తలు వస్తున్నాయి. కాగా తనకు కొంత కాలంగా అమ్మవారు కలలో కనిపిస్తోందని, గుడి నిర్మించాలని నిర్ణయించినట్లు నరసింహా తెలిపారు.

Popular Articles