మేడారం: సమ్మక్క-సారలమ్మ భక్తులతో శుక్రవారం మేడారం కిక్కిరిసింది. అమ్మవార్లకు ప్రీతిపాత్రమైన శుక్రవారం కావడంతో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మొక్కులు సమర్పించుకున్నారు. తెలంగాణా నుంచే కాదు ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్, కర్నాటక, ఒడిషా, మమారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజే ఆరు లక్షల మంది భక్తులు మేడారం తల్లులను దర్శించుకున్నట్లు అధికార వర్గాలు అంచనా వేశాయి. మహాజాతరకు ముందే కిక్కిరిసన మేడారంలో భక్తజన సందోహపు దృశ్యాల్లో కొన్ని..












