ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యను అధికారికంగా ప్రభుత్వం వెల్లడించింది.మహా కుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ మీడియాకు వెల్లడించిన సమాచారం ప్రకారం.. తొక్కిసలాటలో 30 మంది మరణించారు. మరో 60 మంది గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయినవారిలో 25 మందిని గుర్తించారు. మరో ఐదుగురిని గుర్తించాల్సి ఉంది. గత రాత్రి 1-2 గంటల మధ్య తొక్కిసలాట జరిగింది. బారికేడ్ల ధ్వంసం వల్లే తొక్కిసలాట జరిగినట్లు డీఐజీ వివరించారు. కుంభమేళాలలో ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు డీఐజీ వివరించారు.