నికృష్టుడు.. నక్క పీనుకుగును ఇష్టపడుతుంది.. పంది బురదను కోరుకుంటుంది.. పెండపురుగు గొడ్ల చావిడిని కోరుకుంటుంది.. రోత డైలాగులు, ఇరవై నెలల్లో ఏం పీకినవ్..? నువ్వు పీకేదేంది? మగాడివైతే లై డిటెక్టర్ పరీక్షలకు రా.. ఓ సినిమాలో దొంగతనం చేసి వెంటనే దొరికిపోయే బ్రహ్మానందం టైపు నువ్వు (జులాయి సినిమాలోని సీన్ ను ఉద్దేశించి). చిల్లరదొంగ, చీకటి బతుకు. కిట్టీ పార్టీ ఆంటీ టైపు నువ్వు. నీ బొంద.. దౌర్భాగ్యుడు, చెప్పు తీసుకుని కొడతా.. అని కోర్టు చెప్పింది నీకు… స్టే కు, ఇంజక్షన్ ఆర్డర్ కు తేడా తెల్వది నీకు.. చిల్లరగాడు, అంతర్రాష్ట్ర దొంగ, సంచులు మోసేటోడు, హౌలా, లోఫర్ రాజకీయాలు, నీకేం నొచ్చింది? మన్నూ, మశానం, వాడి బొం., పీకేదేం లేదు. వాళ్ల అయ్య కావచ్చు, తాత కావచ్చు.. ఫుట్ బాల్ ఆడుతా. పెద్ద పోటుగాని లెక్క.. బాకా పత్రికలు.. గల్లీ రౌడీ, ఢిల్లీకి పోయి, సిల్లీ మాటలు.. దగుల్బాజీ, లుచ్ఛా రాజకీయాలు.. ఇవీ సీఎం రేవంత్ రెడ్డిని, ఖమ్మం జిల్లా మంత్రులను ఉద్ధేశిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఘాటు వ్యాఖ్యల సారాంశంలోని కొన్ని పదాలు.
నాకు ఇష్టముండదు తిట్లు తిట్టడం.. కానీ నాకు కూడా తప్పడం లేదు తిట్టడం.. అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తనదైన శైలి భాషా పరంగా రెచ్చిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్ నోటి నుంచి వెలువడిన తిట్లదండకం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తాను జీవితంలో సిగరెట్ కూడా తాగలేదని, మత్తు పదార్థాలకు, డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలని ఈ సందర్బంగా కేటీఆర్ పిలుపునిచ్చారు. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెంటనే రియాక్టయ్యారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ వాడిన పూర్తి భాషా సౌందర్యాన్ని దిగువన గల వీడియో లింక్ లో వీక్షించవచ్చు.
